రివ్యూ : అర‌కు రోడ్ లో

311
- Advertisement -

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసిన సాయిరామ్ శంకర్ హీరోగా పలు చిత్రాలతో బాగానే మెప్పించాడు. చాలా కాలం గ్యాప్‌ తర్వాత తిరిగి అరకు రోడ్‌లో అంటు ముందుకు వచ్చాడు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాతో సాయిరామ్‌ ఆకట్టుకున్నాడా..?అసలు అరకు రోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం…

కథ :

విశాఖపట్నంలో ఓ సీరియల్ కిల్లర్‌ వరుస హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. పోలీసులు ఈ కిల్లర్‌ని పట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఇలాంటి ప్రాంతానికి హీరో పోతురాజు(సాయిరామ్‌ శంకర్‌) ఎంటరవుతాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌(నిఖిషా పటేల్‌)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తరుణంలో పెద్ద చిక్కుల్లో పడతారు. అసలు వీరు ఏ కష్టంలో చిక్కుకున్నారు..? పోతురాజు జీవితం కష్టాల్లో చిక్కుకోవడానికి గల కారణమేంటి..?చివరకి కథ ఎలా సుఖాంతమైందో తెరమీద చూడాల్సిందే..

Araku Road Lo Movie Review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథకు బలాన్నిచ్చేలా సన్నివేశాలు, ఇంటర్వెల్ ట్విస్ట్. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే మొదటి ఇరవై నిమిషాలు ప్రేక్షకులు థ్రిల్లింగ్ సన్నివేశాలనే తనదైన నటనతో సాయిరామ్‌ మెప్పించాడు. ఫస్టాఫ్‌లో సాయిరామ్ శంకర్, సత్యల కామెడీ బాగా నవ్వించింది. ఫస్టాఫ్‌లో సరదాగా , సెకండాఫ్‌లో పూర్తి సీరియస్‌గా మారిపోయే పాత్రలోని ఎమోషన్‌ను బాగా పట్టుకున్నాడు. నిఖిషా పటేల్ తన దైన గ్లామర్‌తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మైనస్ పాయింట్స్ :

కథలో బలం లేకపోవడం, పేలవమైన క్లైమాక్స్ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్‌. నాలుగైదు టిస్ట్‌లు, వాటిచుట్టూ వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను మినహాయిస్తే మిగతా సన్నివేశాలన్నీ నిరుత్సాహ పరుస్తాయి. పృధ్వీ కామెడీ కూడా బోరింగ్‌గా అనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు.

సాంకేతిక విభాగం :

కథ ఎంచుకోవడంలో దర్శకుడు కొత్తదనమే చూపినా…దానికి తెరమీదకు తీసుకురావటంలో విఫలమయ్యాడనే చెప్పాలి.అనవసరమైన సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవాలి. సినిమా బడ్జెట్ దృష్ట్యా ఈ విజువల్స్ స్థాయి బాగుందనే అనాలి. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Araku Road Lo Movie Review

తీర్పు :

పూరి తమ్ముడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయిరామ్‌….చాలా కాలం తర్వాత అరకు రోడ్‌లో మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంటర్వెల్ ట్విస్ట్, థ్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్ కాగా….పేలవమైన క్లైమాక్స్, కొన్ని సన్నివేశాలు అతికించినట్లు ఉండటం మైనస్ పాయింట్. మొత్తంగా సాయిరామ్ శంకర్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ప్రయాణమే అరకు రోడ్‌లో.

విడుదల తేదీ : 02/12/ 2016
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సాయిరామ్ శంకర్, నిఖిషా పటేల్
సంగీతం : వాసుదేవ్
నిర్మాత : మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా
దర్శకత్వం : వాసుదేవ్

- Advertisement -