నా ఫస్ట్‌నైట్‌ అలా గడిచిపోయింది….

149
Alia Bhatt Spent Her First Night

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్….బాలీవుడ్లో వేగంగా దూసుకెలుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేస్తోంది. మొదటి సినిమా నుండే గ్లామర్ పరంగా తన తడాఖా చూపుతున్న అలియా భట్…చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో వెండి తెరను వేడెక్కిస్తోంది.

Alia Bhatt Spent Her First Night

అయితే ఆలియా భట్ ఫస్ట్ నైట్ పూర్తయిపోయిందట. ఈ విషయాన్ని తనే చెప్పింది. అంతే కాదు తన ఫస్ట్ నైట్ ఎలా గడిచిందో ఓ ఫోటో కూడా పెట్టింది ఆలియా. అయితే.. ఇది తన సొంతింటిలో గడిపిన ఫస్ట్ నైట్ గురించి మాత్రమే.

Alia Bhatt Spent Her First Night

రీసెంట్ గా ఆలియా తన కోసం ఓ ఫ్లాట్ కొనుక్కును సొంతింటి చిన్నది అయిపోయింది. ముంబైలోని పోష్ ఏరియా జుహులో ఓ లావిష్ అపార్ట్ మెంట్ ఖరీదు చేసింది ఆలియా. ఇందులోకి తన సోదరి షహీన్ భట్ తో కలిసి గృహప్రవేశం కూడా చేసేసిన ఈ బ్యూటీ.. తను సొంతింటిలో రిలాక్స్ అవుతున్న ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘చివరకు సోదరి షహీన్ భట్ తో కొత్తింటిలో నైట్ నెంబర్ 1. మేం సాధించాం’ అంటూ ట్వీట్ పెట్టిన ఈ భామ.. సోఫాలో కూర్చుని టేబుల్ పై కాళ్లారచాపుకుని కూర్చున్న ఫోటో ఒకటి పెట్టింది. ఈ ఫోటోలో ఆలియా కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

కొత్త ఇంట్లో తొలి రాత్రిని నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నా అంటూ ఈ అమ్మడు గతంలో కూడా ట్విట్‌ చేసి షాక్‌ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఇంట్లో తన సిస్టర్ షహీన్‌తో కలసి ఉంటున్నట్లు తెలిపింది ఆలియాభట్‌.

Alia Bhatt Spent Her First Night

ఈ ఫోటోలో ఆలియా భట్‌ ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే మాత్రం అమ్మడి టేస్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. మరోవైపు రీసెంట్ గా షారూక్ ఖాన్ తో కలిసి నటించిన మూవీ డియర్ జిందగీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. రణబీర్ కపూర్ తో డ్రాగన్ లోను.. వరుణ్ ధావన్ తో బద్రీనాథ్ కి దుల్హనియాలోను నటిస్తోంది.