ఏప్రిల్14..125అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ

55
- Advertisement -

బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్…నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ హుస్సేన్‌సాగర్ తీరాన 125అడుగల ఎత్తులో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్‌ అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జూన్‌ 1న అమరవీరుల జ్యోతిని ప్రారంభోత్సవం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకునేందుకు అమర జ్యోతి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించాలని కేసీఆర్ సూచించారు. విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి…

సర్వేలన్నీ అనుకూలం..విజయం తథ్యం…

నూతన సచివాలయం ముహుర్తం ఖరారు..

రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలివే..

- Advertisement -