bank:ఏప్రిల్ మాసంలో బ్యాంకుల సెలవుల చిట్టా..!

17
- Advertisement -

మీకు వచ్చే నెలలో డబ్బులు కావలంటే ముందస్తుగా తీసుకోండి. లేకుంటే చాలా కష్టమవుతుంది. అవును ఇది నిజం ఏప్రిల్‌ నెల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో దాదాపు నెల్లో సగం రోజులు పనిచేయడం లేదు. శని ఆదివారాలతో కలిపి దాదాపు 15రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయి.

ఆర్బీఐ ప్రకారం.. ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాలను సర్ధుబాటు చేసే సందర్బంగా సాధారణ కార్యకలపాలు నిర్వహించరు. అలాగే 4వ తేదీన మహవీర్ జయంతి, 5వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 7న గుడ్‌ఫ్రైడ్‌, 14న అంబేద్కర్ జయంతి, 22వ తేదీన రంజాన్ నేపథ్యంలో తెలంగాణలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయని ప్రకటించింది.

మొత్తమీద రెండు నాలుగో శనివారాలు బ్యాంకులు పనిచేయవు. అలాగే వచ్చే మొత్తం ఐదు ఆదివారాలు రావడంతో మొత్తంగా నెల్లో సగం రోజులు పనిదినాలు కలిగిఉన్నాయి. అయితే ఇందులో రంజాన్‌ పండుగ నేపథ్యంలో తెలంగాణలో మాత్రమే సెలవు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండవు. అలాగే మహవీర్‌ జయంతి రోజు కూడా సెలవు లేదు. ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 11రోజులు బ్యాంకులు సెలవు దినాలు. కానీ దేశవ్యాప్తంగా మొత్తంగా 15రోజులు పనిచేయవు.

ఇవి కూడా చదవండి…

rahulgandhi:రాహుల్ క్షమాపణలు చెప్పాలి..లేదంటే..!

Gold Price:స్వల్పంగా తగ్గిన పసిడి

savarkar:రాహుల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఉద్ధవ్..!

- Advertisement -