బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ అగంతకుడు ఫోన్ చేసి సల్మాన్‌ఖాన్‌ను ఏప్రిల్ 30న చంపేస్తామని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. సల్మాన్ నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. అగంతకుడు తన పేరు రాకీభాయ్ అని, జోధ్‌పూర్‌కు చెందిన గోరక్షకుడినని ఫోన్‌లో చెప్పినట్లు సమాచారం. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
అయినా, ఒక స్టార్ హీరోను ఏప్రిల్ 30న చంపేస్తాం అని బెదిరించడం నిజంగా షాకింగ్ విషయమే. ఇక్కడ విచిత్రమైన విశేషం ఏమిటంటే.. సల్మాన్ ఖాన్ కు గతంలో కూడా చాలా సార్లు ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ మధ్య అయితే సల్మాన్ ఇంటి చుట్టూ కూడా కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. ఇక రీసెంట్ గా అయితే సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్రూప్ నుంచి డైరెక్ట్ బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు అతని సన్నిహితుడు ప్రశాంత్ కు మెయిల్ వచ్చింది.
సల్మాన్ ఖాన్ తో మాట్లాడాలనుకుంటున్నామని, అతన్ని చంపడమే తమ లక్ష్యమని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అందులో పేర్కొన్నారు. దీంతో సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. అలాగే, సల్మాన్ ఖాన్ కు పోలీసులు సల్మాన్ కు భారీ బందో బస్త్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, ఆన్-గ్రౌండ్ ఈవెంట్లకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అయినా మళ్లీ ఇప్పుడు బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయింది.
ఇవి కూడా చదవండి…