అప్పుడు మైఖేల్.. ఇప్పుడు కబ్జ

43
- Advertisement -

ఒక బ్లాక్ బస్టర్ తాలూకు ప్రభావం కేవలం అభిమానుల మీదే కాదు ఫిలిం మేకర్స్ మీద కూడా ఉంటుందని చెప్పడానికి కెజిఎఫ్ ని మించిన ఉదాహరణ అక్కర్లేదేమో. అందులోని రాఖీ భాయ్ ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథలు రాసుకుందామనే ఆలోచనలో దర్శకులు వేస్తున్న తప్పటడుగులకు హీరోలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గత నెల సందీప్ కిషన్ మైఖేల్ ఎంత నిరాశాజనకమైన ఫలితం అందుకుందో ఎవరూ మర్చిపోలేదు. నిజానికి తను ఈ మూవీ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. అయితే ఎలివేషన్ల ట్రాప్ లో పడ్డ డైరెక్టర్ అసలు కథని సరిగా రాసుకోకపోవడంతో డిజాస్టర్ పడింది

మేకింగ్ ఎంత స్టయిలిష్ గా ఉన్నా సోల్ లేని స్టోరీని ఆడియన్స్ ఒప్పుకోలేదు.దీంతో సందీప్ హార్డ్ వర్క్ కి గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఉపేంద్ర వంతు వచ్చింది. కబ్జతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ స్టార్ యాక్టర్ సైతం కెజిఎఫ్ ఫార్ములాకి లొంగిపోవడంతో మార్నింగ్ షోతో మొదలుకుని విపరీతమైన నెగటివ్ టాక్ పాకిపోతోంది. అటు కర్ణాటకలోనూ దీనికేమంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చూసి ఖంగారు పడిన బయ్యర్ల భయమే నిజమయ్యేలా ఉంది. కాకపోతే క్యాస్టింగ్ వల్ల ఈ వీకెండ్ ఓ మోస్తరుగా పే చేయొచ్చు

లెక్కల సంగతి పక్కనపెడితే కబ్జని కెజిఎఫ్ జెరాక్స్ కాపీగా వర్ణిస్తూ జరుగుతున్న ట్రోలింగ్ మాములుగా లేదు. శాండల్ వుడ్ అది పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉందని అక్కడి విశ్లేషకుల అంచనా. మొత్తానికి ప్రశాంత్ నీల్ సృష్టించిన ఒక ప్రత్యేక జానర్ ని హ్యాండిల్ చేయడం చేయడం అందరివల్లా కాదని ఈ రెండు ఉదాహరణలతో అర్థమైపోయింది. ఇదే టైపులో ధృవ సర్జ నటించిన మార్టిన్ అనే మరో ప్యాన్ ఇండియా కన్నడ మూవీ రెడీ అవుతోంది. పోనీ ఇదైనా కెజిఎఫ్ ఎఫెక్ట్ నుంచి బయటపడి ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

చిన్న హీరో పై ఎన్టీఆర్ పొగడ్తలు !

యశ్ ఒక జెంటిల్‌మెన్‌: శ్రీనిధి

నెపోటిజంపై రామ్‌చరణ్ కామెంట్‌..!

- Advertisement -