యశ్ ఒక జెంటిల్‌మెన్‌: శ్రీనిధి

14
- Advertisement -

కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి..దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కేజీఎఫ్ సినిమాలతో స్టార్డమ్‌ తెచ్చుకున్న ఈ కన్నడ అమ్మడు సినీ కెరీర్‌లో అచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ఈ భామపై దేశవ్యాప్తంగా సోషల్‌మీడియా వేదికగా యశ్ తనని ఇబ్బంది పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. కేజీఎఫ్ సినిమా షూటింగ్‌ టైమ్‌లో యశ్ తనని ఇబ్బంది పెట్టేవాడని దాన్ని సారాంశం. ఈ విమర్శలపై కొంతకాలంగా కామ్‌గా ఉన్న తాజాగా స్పందించింది.

ఇదే విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ..కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసేందుకు సోషల్‌మీడియాను ఉపయోగిస్తుంటారు. కానీ నేను ప్రేమను పంచేందుకు ఇదొక సాధనమని అనుకుంటా. యశ్ తో నటించేటప్పడు…సెట్‌లో నాకెప్పుడూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆయన నాకు రోల్‌మోడల్, ఒక జెంటిల్‌మెన్, మెంటార్, మంచి ఫ్రెండ్‌ అతనితో కలిసి నటించడాన్ని ఆస్వాదించాను అని చెప్పుకొచ్చింది. దీంతో సోషల్‌మీడియాలో వచ్చే రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్టయింది.

ఇవి కూడా చదవండి…

అసలు కమల్ హాసన్ కి ఏమైంది?

ఆస్కార్‌ విన్నర్స్‌కి ఘన స్వాగతం..

ఆస్కార్‌తో హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ టీం..

- Advertisement -