185 మంది ఉద్యోగులకు యాపిల్‌ ఉద్వాసన!

1
- Advertisement -

టెక్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌ 185 మంది ఉద్యోగులను తొలగించింది. నిధుల దుర్వినియోగం చేసి జీతాల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై కాలిఫోర్నియా కుపెర్టినో హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న వీరిని విధుల నుంచి తొలగించారు.

వీరిలో ఆరుగురు చైనా ఉద్యోగులపై కేసులు కూడా నమోదయ్యాయి.ఉద్యోగం నుండి తొలగింపునకు గురైన ఉద్యోగులలో పలువురు భారతీయులు ఉండటం గమనార్హం,

ముఖ్యంగా తెలుగువారు 50 మంది ఉన్నారు. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాపిల్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు వారు లాభేతర సంస్థల సేవా కార్యక్రమాలకు సొమ్ములు విరాళంగా ఇచ్చేందుకు సంస్థ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది.దానిని ఆసరా చేసుకుని మీరు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు.కోట్లాది రూపాయల వేసనాలు వీరికి లభిస్తున్నప్పటికీ అవినీతికి దొంగ డబ్బుకు కక్కుర్తి పడి ఉద్యోగాన్ని పోగొట్టుకోవడమే కాక భారతదేశ పరువు తీశారు.వీరి కారణంగా భవిష్యత్తులో యాపిల్ సంస్థలు భారతీయులకు ఉద్యోగాలు లభించని పరిస్థితి ఏర్పడింది.

Also Read: 737 మంది పాలస్తీనియన్ల విడుదల.. 

- Advertisement -