స్టీవ్ పాతచెప్పుల వేలం ఎక్కడో తెలుసా..

403
- Advertisement -

మనిషి యొక్క పురాతన వస్తువులను కొంతమంది ఉపయోగించుకుంటారు. మరికొందరూ వాటిని దొంగలించి దాచిపెట్టుకుంటున్నారు. ఇంకా కావాలంటే వాటిని వేలం ద్వారా కొనుగోలు చేసి మరీ వాటిని దాచిపెట్టుకుంటారు. అటువంటి వాటిలో యాపిల్ కంపెనీ మాజీ సీఈవో, కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌ వాడిన చెప్పులు వేలం పెట్టారు.

ప్రస్తుతం నూతన టెక్నాలజీని వినియోగదారులకు అందించడంలో ముందుండే సంస్థే..యాపిల్. అమెరికాలో పుట్టిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మదిని దోచుకుంటుందని మనందరికి తెలుసు. అయితే వివరాల్లోకి వెళ్తే.. వేలంలో ఉంచిన స్టీవ్ జాబ్స్ చెప్పులు ఆయన 1970, 1980ల మధ్య ధరించిన పాదరక్షలని వేలం నిర్వహిస్తున్నట్టు జూలియన్ ఆక్షన్‌ వెబ్‌సైట్ తెలిపింది.

పాత, అరిగిపోయిన చెప్పులు ఈ వేలంలో రికార్డు ధర పలికాయి. స్టీవ్‌జాబ్స్ వాడిన బ్రౌన్‌ సుడే లేథర్ బిర్కెన్‌ స్టాక్ ఆరిజోనా శాండల్‌ ను ఆన్‌లైన్ వేలంను వెబ్‌సైట్ అయిన జూలియన్ ఆక్షన్‌లో వేలంలో ఉంచగా ఇప్పటికే 17.7 లక్షల ధర పలికాయి. ఇంకా వేలం ముగియలేదు. ఇది నవంబర్ 11న ఈ వేలం మొదలవ్వగా నవంబర్ 13తో ముగియనుంది.

అంతేకాదు.. స్టీవ్ జాబ్స్ ధరించిన ఈ చెప్పులకు ఘన చరిత్రే ఉంది. ఈ చెప్పులను పలు ఎగ్జిబిషన్లలో కూడా ఉంచారు. ఇటలీలోని 2017 మిలాన్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌తో పాటు పలు సందర్భాల్లో ఈ చెప్పులను ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఇప్పటికే ఈ వేలంలో స్టీవ్ జాబ్స్ చెప్పుల ధర 22,500 డాలర్ల వరకూ ధర పలికింది. వేలం ముగిసేసరికి 60,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకూ వెళ్లొచ్చని వేలం నిర్వహించిన వెబ్‌సైట్ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి..

పుతిన్…భారీ ఆఫర్‌

టీజర్…మీట్ క్యూట్

చరిత్రలో సులువైన ఛేదన ఇదేనా..భారత్‌

- Advertisement -