తెలుగు సీనియర్ నటుడు అప్పాజీ అంబరీష గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన మాటల్లో లొసుగులు ఉండవు. ఏదైనా డైరెక్ట్ గానే చెబుతాడు. బుల్లితెర పై నటుడిగా ఎదిగి.. ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అప్పాజీ అంబరీష. టాలీవుడ్ లో అప్పాజీ అంబరీషకు కొన్ని పాత్రల కోసం ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే, తాజాగా ఈ నటుడు సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తాడు. ఛాన్స్ కోసం ఒకరు తమ దగ్గర ఉన్నది ఇస్తారు, ఛాన్స్ ఇవ్వడానికి ఇంకొకరు తమకు కావాల్సింది అడుగుతారు, ఇది పక్కా అవకాశ వాదం అన్నట్టు అప్పాజీ అంబరీష కామెంట్స్ చేశాడు.
అప్పాజీ అంబరీష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా కోడలికి సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఆమె అవకాశాల కోసం ఆశగా ఎప్పుడూ అడుగుతూ ఉండేది. నాకు ఆమె నటించడం ఇష్టం లేదు. కానీ ఆమె మాత్రం నటించాల్సిందే అని పట్టుబట్టింది. నన్ను కాదు అని ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కొన్నాళ్ళు తర్వాత నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు అందరూ నన్ను వాడుకోవాలని చూస్తున్నారు అని విలపించింది. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఆమెకు అప్పుడు వివరించాను. ఇక్కడ జరిగే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమెకు చెప్పాను.
అవకాశాలు కావాలి అంటే.. బెడ్ రూమ్ లకు వెళ్ళాలి అని ఉన్న విషయం చెప్పాను. అలాగే, ఓ నటి పై ఎలాంటి ఆరోపణలు వస్తాయో వివరించాను. ఇండస్ట్రీలో పని చేసే ఆడవాళ్లకు క్యారెక్టర్ ఉండదు. ఉన్నా.. ఇండస్ట్రీ జనాలు క్యారెక్టర్ ను ఉండనివ్వరు అని చెప్పాను. అలాగే నటీమణులు పెట్టే పోస్టులకు కామెంట్లు ఎలా వస్తాయో చెప్పలేం’ అని అప్పాజీ అంబరీష కామెంట్స్ చేశాడు. అప్పటి నుంచి తన కోడలు మళ్లీ సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించలేదు అని ఈ నటుడు వ్యాఖ్యానించాడు.
Also Read:కామెర్ల వ్యాధికి చెక్ పెట్టండిలా!