టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌

9
- Advertisement -

టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ షిప్‌ను దక్కించుకుంది అపోలో టైర్స్‌. మొత్తం రూ.579 కోట్లకు జెర్సీ హక్కులను పొందింది. మూడు సంస్థల మధ్య జరిగిన పోటీలో అపోలో టైర్స్‌ ఈ మేరకు స్పాన్సర్‌ షిప్‌ను దక్కించుకుంది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉండనుంది. ఇందులో 121 ద్వైపాక్షిక మ్యాచ్‌లు, 21 ఐసీసీ మ్యాచ్‌లు కవర్‌ అవుతాయి.

గురుగ్రామ్‌ కేంద్రంగా ఉన్న ఈ టైర్‌ కంపెనీ 100 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది. పోటీలో Canva రూ.544 కోట్లు, జేఎక్ సిమెంట్స్‌ రూ.477 కోట్ల బిడ్‌లు పెట్టగా, అపోలో టైర్స్‌ అగ్రస్థానంలో నిలిచింది.

ఒప్పందం ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ.4.77 కోట్లు వస్తాయి. అయితే ద్వైపాక్షిక మ్యాచ్‌లు, ఐసీసీ మ్యాచ్‌ల విలువల్లో తేడా ఉండటం వల్ల ఈ మొత్తంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించిన బేస్‌ ప్రైస్‌ ద్వైపాక్షిక మ్యాచ్‌లకు రూ.3.5 కోట్లు, ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు రూ.1.5 కోట్లు.

Also Read:KTR:ఇంతకంటే చేతగాని తనం ఉంటుందా?

కొత్తగా తీసుకొచ్చిన గేమింగ్ యాక్ట్‌లో డ్రీమ్ 11 స్పాన్సర్ షిప్‌ను కొల్పోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -