ఇంత పవిత్రమైన ప్రదేశంలో శ్రీవారి విగ్రహం అవమానానికి గురవ్వడం ఒక తీవ్రమైన అపచారం, నిజానికి ఇది దైవ ద్రోహం కంటే తక్కువేమీ కాదు అని మండిపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆ విగ్రహం పక్కనే మద్యం సీసాలు ఉండటం, అక్కడే మద్యపానం జరుగుతోందని తేటతెల్లం చేస్తోంది అని దుయ్యబట్టారు.
అలిపిరి పాదాల చెంత నిర్లక్ష్యంగా శ్రీమహా విష్ణువు విగ్రహాన్ని ఉంచారు. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిరక్ష్యంగా వదిలేశారని భూమన కరణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల తీవ్ర నిరక్ష్యం అంటూ మండిపడ్డారు. తక్షణమే టీటీడీ చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు భూమన.
Also Read:అమెరికాలో మళ్లీ టిక్‌టాక్..!
అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద నిర్లక్ష్యంగా పడి ఉంది శ్రీమహావిష్ణువు విగ్రహం. హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కొవాలి వెంటనే స్పందించాలని కోరారు భూమన.

