సీఎం కేసీఆర్ చేపడతున్న సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ యాదవులు ఫిదా అయ్యారు. యాదవ సంక్షేమం కోసం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.
గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేయడం.. వారి సంక్షేమం కోసం 10 ఎకరాల స్థలంలో గొల్లకుర్మల సంక్షేమ భవన సముదాయానికి శంకుస్థానం చేయడం అద్భుతమని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి అభినందనీయమని ఏపీ యాదవ సోదరులు పేర్కొన్నారు. రాజకీయాల్లో యాదవులకు సముచిత స్ధానం కల్పిస్తామనడం గొప్ప విషయమని కొనియాడారు.
ఇదిఇలా ఉండగా యాదవుల కోసం రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. గొల్ల,కురుమలకు రూ. 10 కోట్లతో 10 ఎకరాల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. పునర్విభజన వల్ల పెరిగే అసెంబ్లీ స్థానాల్లో కూడా యాదవులకు టికెట్లు ఇస్తామని సీఎం పేర్కొన్నారు. దీంతో సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.