భాగమతి టీజర్‌..ప్రభాస్ ప్రశంసలు

221
Bhaagamathie Telugu Trailer
- Advertisement -

అనుష్క ప్రధానపాత్రలో అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భాగమతి. సోమవారం ట్రైలర్ విడుదల కాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విడుదలైన మూడు గంటల్లోనే 20 లక్షలకు పైగా వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది.

భాగమతిగా అనుష్క నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో భాగమతి ట్రైలర్‌పై ప్రభాస్ స్పందించారు. అనుష్కకు కష్టపడేతత్వం, డెడికేషన్‌ ఉన్నాయన్న ప్రభాస్  ఈ ట్రైలర్‌ను ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘ట్రూ హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌ . స్వీటీకి, అశోక్‌కి, యూవీ క్రియేషన్స్‌ సంస్థకి గుడ్‌లక్‌’ అని ప్రభాస్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇటీవల టీజర్‌ విడుదలైనప్పుడు కూడా ప్రభాస్‌.. అనుష్కపై ప్రశంసలు కురిపించారు.  ప్రతి సినిమాలో కొత్తగా ప్రయత్నించడంలో ఆమె తొలి వరుసలో ఉంటారు. స్వీటీ, యూవీ క్రియేషన్స్‌ టీంకు అభినందనలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ యువీ క్రియేషన్స్ తో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -