మహేశ్ బాబు ఇంటిముందు విద్యార్దుల ధర్నా

371
mahesh babu

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు జై ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి యువజన పోరాట సమితి విద్యార్దులు ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైదరాబాద్ లోని మహేశ్ బాబు ఇంటిముందు నిరసన తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు విద్యార్దులను అరెస్ట్ చేశారు. రాజధాని తరలింపు విషయంపై మహేశ్ బాబు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అంశంపై సినీ పెద్దలు స్పందించాలని కోరారు. రేపటి నుంచి ప్రతి హీరో ఇంటి వద్ద నిరసనలు తెలియజేస్తామని చెప్పారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని, కర్నూల్‌లో హైకోర్టు, అమరావతి, విశాఖలో బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. శనివారం అల్లు అర్జున్ ఇంటిముందు, జనవరి 12వ తేదీన మెగాస్టార్ చిరంజీవి, 13న బాలకృష్ణ, 14న జూనియర్ ఎన్టీఆర్, 15వ తేదీన మోహన్ బాబు, 16న మా అధ్యక్షుడు నరేష్ ,17న ప్రభాస్, 18న నాగార్జున, 19న వెంకటేష్ ఇళ్ల ముందు నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు.