బాలీవుడ్ బ్యూటీతో పృథ్వీషా ప్రేమాయణం..

68

బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ సింగ్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడట క్రికెటర్ పృథ్వీషా.. బాలీవుడ్ హీరోయిన్లు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం నడవడం ఇప్పుడేమీ కొత్త కాదు.. ఈ లిస్టులో ఇప్పుడు పృథ్వీషా, ప్రాచీ సింగ్ కూడా చేరిపోయారని తెలుస్తోంది. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పృథ్వీని హత్తుకున్న ఫొటోలను ప్రాచీ సింగ్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. చాలా కాలంగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరి పోస్టులకు మరొకరు స్పందిస్తూ వస్తున్నారు.

హిందీ సీరియల్ ‘ఉదాన్’తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రాచీ సింగ్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పొగొడుతూ ఉంటుంది. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ప్రాచీ సింగ్.. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీషా ఘోరంగా విఫలమయ్యాడు. స్వల్ప స్కోర్లకే అవుటై పెవిలియన్‌లో నిరాశగా కూర్చోవడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో పృథ్వీ స్మైల్‌ను మిస్ అవుతున్నానంటూ పోస్టు చేసింది. మరోవైపు వీరి జంట చూడముచ్చటగా ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.