అంబేద్కర్ 65వ వర్ధంతి.. నివాళులర్పించిన ఏపీ స్పీకర్‌..

35
AP Speaker

భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్ధిక, రాజకీయ, సామాజిక తత్వవేత్త, దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్.అంబేద్కర్ అని ఏపీ రాష్ట్ర శాసనసభాపతి తమ్మి నేని సీతారామ్ కొనియాడారు డా.బి.ఆర్.అంబేద్కర్ 65వ వర్ధంతిని పురష్కరించుకొని శ్రీకాకుళంలోని స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి శాసనస భాపతి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనంలోనే సామాన్యులు పడుతున్న బాధలను గుర్తించి, రిజర్వే షన్లు లేకుంటే సమానత్వం రాదనే ఉద్దేశ్యంతో ఎస్సీ, ఎస్టీ,బి.సి, ఇ.బి.సి, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలనే సత్సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రచించి, అందులో పొందుపరచడం జరిగిందన్నారు. డా. బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలలోనే అత్యంత ఉత్తమమైనదని అన్నారు.

ఇస్లామిక్ దేశాల్లో మతమే రాజ్యాంగమని, కాని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మనదేశం గొప్ప ప్రజాస్వా మ్య వ్యవస్థకు దిక్సూచి అని తెలిపా రు. అటువంటి దేశానికి ఒక దశ, దిశలను నిర్ధేశించడమే కాకుండా వారికి సమానత్వాన్ని కల్పించిన ఘనత అంబేద్కర్ దేనని వివరిం చారు. ఆయన మేధాశక్తికి కొలంబియా, లండన్ యూనివర్శిటీలు డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించాయని, ఆయన మరణానంతరం మన దేశంలో భారతరత్నను ఇచ్చి గౌరవించుకోవడం మనందరికీ తెలిసిందేనని తెలిపారు.

ఆ మహానుభావుడు కల్పించిన హక్కుల వలనే బిసి వ్యక్తిగా తాను శాసనసభాపతి అయినట్లు గుర్తు చేసారు. అలాగే గ్రూప్ -1 అధి కారులు, అటెండర్ స్థాయి నుండి ఐఏఎస్ వరకు ప్రభుత్వ ఉద్యో గాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. మహిళలు బయటకు రావాలని, విద్యను అభ్యసించాలని, వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకించి ఆ గ్రంథంలో రచించడం జరిగిందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.