ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 310 కేసులు..

99
- Advertisement -

ఏపీలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 23,022 కరోనా పరీక్షలు నిర్వహించగా, 310 మందికి పాజిటివ్‌గా వెల్లడైంది. అదే సమయంలో 994 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,57,562 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,36,048 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,258 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా మరణాల సంఖ్య 14,256కి పెరిగింది. ఇక తాజాగా నమోదైన కేసులలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 54 నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 51, చిత్తూరు జిల్లాలో 45, తూర్పు గోదావరి జిల్లాలో 38 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -