- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 74,919 నమూనాలు పరీక్షించగా 3,342 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 22 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,566కి పెరిగింది. తాజాగా 3,572 మందికి కరోనా నయం అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 551 కొత్త కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 60 పాజిటివ్ కేసులు వచ్చాయి.
ఏపీలో మొత్తం 8,04,026 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,65,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 31,469 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 75,02,933 నమూనాలు పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- Advertisement -