బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి..

140
Errabelli Dayakar

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి రాయపర్తి మండలం ఘటికల్‌లో మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తుకున్నారు. అలాగే ఆయన సొంతూరు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.