పవన్ కు జగన్ శత్రువు కదా..?

32
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి మరింత రాజుకుంటుంది. ఈ మద్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిత్యం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు వైసీపీ టార్గెట్ గా మరి శృతి మించుతున్నాయనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికే వారాహి యాత్ర మొదటి దశ పూర్తి చేసిన పవన్. ఆ యాత్రలో నియోజిక వర్గాల వారీగా వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంచితే పవన్ అంతిమ లక్ష్యం జగన్ ను గద్దె దించడమే అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ను ఉద్దేశించి పవన్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. .

బహిరంగ సభలలోను కార్యకర్తల సమావేశాలలోనూ జగన్ పై సెటైరికల్ విమర్శలు చేస్తూనే ఆయనను ఇమిటేట్ చేస్తూ చురకలు అంటిస్తున్నారు పవన్. గతంలో జగన్ పై విమర్శలు చేసినప్పటికీ, ఆ విమర్శల స్థాయిలో ఒక పరిధిలో ఉండేది. కానీ ప్రస్తుతం జగన్ టార్గెట్ గా పవన్ తీవ్ర స్థాయిలో సెటైర్లు, విమర్శలు గుప్పిస్తూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు. తాజాగా జగన్ ను జలగ అని సంభోదిస్తూ విమర్శల ఘాటు పెంచారు. రాష్ట్రాన్ని జగన్ అనే జలగ పట్టి పిడిస్తోందని, అవినీతి, అరాచకాన్ని జగన్ తార స్థాయికి తీసుకెళ్లరాని విమర్శిస్తూనే.. జగన్ తనకు శత్రువు కాదని అతనికి అంతా సీన్ లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు పవన్. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ తనకు పోటీ కాదనే విధంగా ఉన్నాయనేది కొందరి అభిప్రాయం. కాగా ఈవిధంగా జగన్ ను టార్గెట్ చేయడం వెనుక పవన్ వ్యూహం ఉందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న పవన్.. జగన్ అవినీతి పాలనను ప్రజలకు ఎత్తిచూపుతూ జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ టార్గెట్ గా పవన్ చేస్తున్న విమర్శలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

Also Read:జక్కన్న – మహేష్…లేటెస్ట్!

- Advertisement -