సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం

8
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ మంత్రుల బృందం తమ సింగపూర్ పర్యటనను ఘనంగా ప్రారంభించింది. రాష్ట్ర మౌలిక వసతులు, పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే ఉద్దేశంతో ఐదుగురు కీలక మంత్రులతో కూడిన ఈ బృందం నేటి నుంచి (ఏప్రిల్ 21) ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనుంది.

సింగపూర్ పర్యటనలో భాగంగా మొదటి రోజే ఏపీ మంత్రుల బృందం సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్‌తో సమావేశమైంది. భారత హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో భారత్ మరియు సింగపూర్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు.

ఈ సమావేశంలో పి. నారాయణ (మున్సిపల్ శాఖ),కింజరాపు అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ),వంగలపూడి అనిత (హోం శాఖ),బీసీ జనార్దన్ రెడ్డి (రహదారులు, భవనాల శాఖ),సత్యకుమార్ యాదవ్ (ఆరోగ్య శాఖ) ఉన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, సింగపూర్ నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఈ క్రింది రంగాలపై దృష్టి సారించారు.

Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్‌ సర్కారే: కేసీఆర్

ఏప్రిల్ 27 వరకు కొనసాగే ఈ పర్యటనలో మంత్రుల బృందం పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వారికి వివరించనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం, స్మార్ట్ సిటీల ప్రాజెక్టులపై సింగపూర్ కంపెనీలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

- Advertisement -