కోవిడ్ థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆదేశించారు. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ,ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉన్నఫలంగా విజృంభించడంతో అప్పట్లో జరిగిన నష్టం, ప్రజలు పడిన ఇబ్బందులు వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడ, థర్డ్‌వేవ్ విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
కలెక్టరేట్‌లో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ సిరి, డిఎం అండ్ హెచ్ఓ, వైద్య అధికారులు పాల్గొన్నారు.సాధారణ జ్వరాలను,వైరల్ ఫీవర్స్ అని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన అన్నారు. అప్రమత్తతతో ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. వార్డు వాలంటీర్లును ఈ సందర్భంగా అధికారులు వినియోగించాలని సూచించారు, గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలన్నారు, టెస్టింగ్ ఒకటే కాదని ట్రాకింగ్ కూడా నిర్వహించాలని చెప్పారు.