‘శ్యామ్ సింగ రాయ్’ నుండి సిరివెన్నెల రాసిన చివరి సాంగ్..

44

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘నేలరాజునీ, ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల. దూరమా .. తీరమై చేరుమా. నడిరాతిరిలో తెరలు తెరిచినది .. నడి నిద్దురలో మగత మరిచినది .. ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల’ అంటూ ఈ పాట సాగుతోంది.

శ్యామ్ సింగ రాయ్ సినిమాకు నాని, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ కథ అతి పెద్ద బలంగా మారుతుందనిపిస్తోంది. ‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈరోజు ఈపాట విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది.సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు.

మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

Sirivennela - Lyrical | Shyam Singha Roy | Nani, Sai Pallavi | Sirivennela Seetharama Sastry| Telugu