- Advertisement -
మా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ప్రయాణికులను గుర్తించడం అన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన ఆయన.. తెలంగాణ, కర్నాటక రవాణా శాఖ మంత్రులతో టచ్ లో ఉన్నాం అని తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది… ప్రమాదానికి గురైన బస్సుకు ఆల్ ఇండియా పర్మిట్ ఉంది అన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈ బస్సును తిప్పే హక్కు వాళ్లకు ఉంది అన్నారు.
ఇది కేవలం ప్రమాదం మాత్రమే, ప్రభుత్వ వైఫల్యం లేదు… ఇప్పటికే 19 మృతదేహాలను గుర్తించాం అని వెల్లడించారు.
Also Read:మద్యం దుకాణాలు..95,436 దరఖాస్తులు
- Advertisement -

