- Advertisement -
తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు దాఖలుకాగా గతంతో పోలిస్తే భారీగా 37 వేలు తగ్గాయి దరఖాస్తుల సంఖ్య. అయితే దరఖాస్తులు తగ్గిన 218 కోట్ల ఆదాయం పెరిగింది.
గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా పెంచిన గడువు రద్దు చేస్తూ తీర్పు వస్తుందేమోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి భారీగా 37 వేలు తగ్గిపోయింది దరఖాస్తుల సంఖ్య.
దరఖాస్తుల సంఖ్య తగ్గినా, టెండర్ ధర రూ.3 లక్షలు చేయడంతో గతంలో కంటే స్వల్పంగా ఎక్కువ ఆదాయం వచ్చింది. అక్టోబర్ 18వ తేదీన ముగియాల్సిన దరఖాస్తుల గడువును, ఆశించిన మేరకు ఆదాయం రాలేదని అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది ఎక్సైజ్ శాఖ.
Also Read:కర్నూలు ప్రమాదం..కేసీఆర్,కేటీఆర్ దిగ్భ్రాంతి
- Advertisement -

