- Advertisement -
భౌగోళిక వారసత్వ జాబితాలో బెలుం గుహలకు గుర్తింపుపై మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్నాయి బెలుం గుహలు. బెలుం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
పురాతన సంస్కృతి, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీక. జీఎస్‌ఐ గుర్తింపుతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుంది అని చెప్పారు. బెలుం గుహల ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అన్నారు.
ప్రపంచంలో రెండో, దేశంలో పొడవైన కేవ్స్‌గా బెలుం గుహలకు పేరు…. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తాం అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
Also Read:KTR:పల్లాను పరామర్శించిన కేటీఆర్
- Advertisement -

