నాడు సాయం పొందాడు..నేడు సాయం చేశాడు!

4
- Advertisement -

నాడు సాయం పొందాడు… నేడు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు ఏపీకి చెందిన ఓ వ్యక్తి. విదేశీ విద్యపై ఆసక్తి ఉన్న పేదలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు సాత్విక్. 2016 సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండులో చదువుకున్నారు సాత్విక్ అనే వ్యక్తి.

ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి కలిశారు. నాటి టీడీపీ ప్రభుత్వం సహకరించిందని ముఖ్యమంత్రికి సాత్విక్ వివరించారు.ప్రభుత్వం అందించిన సాయంతో బిజినెస్ మేనేజ్మెంట్లో ఐర్లాండులో ఎంఎస్ విద్యను అభ్యసించానని చెప్పారు.

ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేసిన తాను.. ఇప్పుడు ఐర్లాండులో వ్యాపారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. నాడు ప్రభుత్వం నుంచి సాయం పొందిన తాను.. ఇప్పుడు విదేశాల్లో చదవాలని ఆసక్తి చూపించే పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దశంతో ఉన్నట్టు సాత్విక్ చెప్పారు. ఈ మేరకు మెరిట్ కలిగిన పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాల్లో వారికి చేయూతనిచ్చేలా స్కాలర్ షిప్ పేరుతో ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాము నలుగురు పేదలకు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సాత్విక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తిరిగి సమాజానికి కొంత ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన యువకుడిని ప్రశంసించారు.

Also Read:సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యం!

- Advertisement -