ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు..షురూ!

8
- Advertisement -

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 2026 జనవరిలోనే అంటే మూడు నెలల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సన్నాహాలు మొదలు పెట్టింది. జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు.

ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్ 15వ తేదీలోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అని ఈసీ సూచించింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, ప్రచురించాలి అని తెలిపింది. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలని సూచించింది ఈసీ.

నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి అన్నారు. డిసెంబర్ 15వ తేదీలోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి…అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ రాసిన లేఖలో పేర్కొంది.

Also Read:బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

- Advertisement -