వినాయక లడ్డూ@రూ. 51,07,777 లక్షలు

5
- Advertisement -

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ప్రమాదకర సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఇక వినాయక చవితి అనగానే గుర్తుకొచ్చేది లడ్డూ వేలం. సాధారణంగా వినాయకచవితి లడ్డూ వేలం అనగానే గుర్తుకొచ్చేది బాలాపూర్. అయితే తాజాగా మాదాపూర్ మై హోమ్ భూజాలో రికార్డు బ్రేక్ చేసింది లడ్డు వేలం పాట.

హోరా హోరీగా సాగిన వేలం పాటలో రూ. 51,07,777లకు లడ్డూను సొంతం చేసుకున్నారు గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత గణేష్ ఇల్లందు. గత సంవత్సరం 29 లక్షలు పలికింది లడ్డు ధర. ఈ సారి దానిని బ్రేక్ చేసింది.

ఇక గణపతి నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తూ సీఎస్‌ కే రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే జంగనగరాల పరిధిలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వర కు మద్యం, కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు.

Also Read:రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్

- Advertisement -