బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీ చేశారు.
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయగా పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం 318.110 మీటర్లుగా ఉండగా పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలుగా ఉంది.
ప్రస్తుత నీటి నిల్వ 8.830 టీఎంసీలు కాగా ఇన్ ఫ్లో 1,07,923 వేల క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 1,08,606 వేల క్యూసెక్కులుగా ఉండగా 6 పవర్ హౌస్ లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Also Read:అబ్బురపరిచేలా..‘మదరాసి’

