Pawan:టూరిజం హబ్‌గా ఏపీ

2
- Advertisement -

ఏపీని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం అని తేల్చిచెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీకి 975 కి.మీ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో పర్యాటక రంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు పవన్.

కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని పవన్ ప్రకటించారు. గండికోట లాంటి వారసత్వ ప్రాంతాలను అభివృద్ధితో పాటు రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Also Read:త్వరలోనే కొత్త పాన్ కార్డులు.. పాతవన్నీ రద్దు!

- Advertisement -