- Advertisement -
శనివారం(రేపు) ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. శనివారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఇంటర్ ఫలితాలను మన మిత్ర వాట్సాప్ నవంబర్ 9552300009 ద్వారా కూడా వెల్లడిస్తామని చెప్పారు. వాట్సాప్ నెంబర్ కు హాయ్ సందేశాన్ని పంపడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చునని నారా లోకేశ్ తెలిపారు.
ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరగ్గా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. 9552300009 ద్వారా లేదా.. అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ ద్వారా వెబ్ సైట్ లోనూ ఫలితాలను తెలుసుకోవచ్చు.
Also Read:భూకంప సూచన..ఈ ప్రాంతాల్లో!
- Advertisement -

