భూకంప సూచన..ఈ ప్రాంతాల్లో!

5
- Advertisement -

తెలంగాణలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపపింది. రామగుండంతో పాటు సమీప ప్రాంతాల్లో భూకంపం సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ప్రకంపనల ప్రభావం హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.

అయితే దీనిని భారత వాతావరణ శాఖ కానీ భూగర్భ పరిశోధనా సంస్థ ధృవీకరించలేదు. భూకంప సూచనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపాలు కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ వస్తాయో అంచనా వేయడం చాలా క్లిష్టమైన పని.

అత్యధికంగా 5.0 తీవ్రతకు మించి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో సంభవించిన భూకంపాలు 1969లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1998లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో భూంకంపం వచ్చింది. 1984, 1999, 2013లలో హైదరాబాద్‌లో చిన్నచిన్న భూకంపాలు సంభవించాయి.

 

Also Read:సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే

- Advertisement -