టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. 2014లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని చిరంజీవి ఉల్లంఘించారంటూ గుంటూరు అరండల్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం విదీతమే. 2014 ఏప్రిల్ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు.
దీనిని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టుని ఆశ్రయించారు. చిరంజీవిపై అక్రమంగా కేసు నమోదు చేశారని అతని తరఫు సీనియర్ న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్నారని, కాని అధికారులు అక్రమంగా కేసు నమోదు చేశారని చిరు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వాద ప్రతివాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీ పోలీసులు చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహరెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు.