ఆశా వర్కర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

3
- Advertisement -

ఆశా వర్కర్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలు. సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే రూ. 5 వేలు చెల్లింపు.గరిష్టంగా మొత్తం రూ లక్షన్నర వరకు చెల్లించనున్నట్లు తెలిపింది. రిటైర్‌మెంట్ తరువాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరొదైపు అమరావతి- రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ. 81,317 కోట్ల మేర పనుల్ని ప్రతిపాదించింది సీఆర్డీఏ. ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు సీఎంకు వివరించారు అధికారులు.

Also Read:ఇదేనా తెలంగాణ రైజింగ్?: కేటీఆర్

- Advertisement -