హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ దోపిడీకి దొంగలు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా తెలంగాణ రైజింగ్… అని ప్రశ్నించారు.
మరోవైపు దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చెక్ పోస్టులు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి ప్రత్యేక పోలీసు బృందాలు. దొంగలు పటాన్ చెరు మీదుగా మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం.
ఉదయం 10.35 నిమిషాలకు ఖజానా జ్యువెలర్స్ లోకి దుండగులు చొరబడ్డారు అన్నారు సీపీ అవినాష్ మహంతి. 10:45 వరకు సుమారు పది నిమిషాల పాటు దోపిడి దొంగలు లోపలే ఉన్నారు … రావడంతోనే బంగారం ఎక్కడుందని స్టాఫ్ ను ప్రశ్నించారు అన్నారు. ఆ వెంటనే కాల్పులు జరిపారని..ఈ కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్ సతీష్ తొడ భాగంలో గాయాలయ్యాయి అని చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి పది బృందాలు ఏర్పాటు చేశాము…బోర్డర్ చెక్ పోస్టులను అప్రమత్తం చేశాం అని తెలిపారు సీపీ అవినాష్ మహంతి.
Telangana is Rising
In Crime Rate and Daylight Robberies #CongressFailedTelangana https://t.co/ZwXMilrI23
— KTR (@KTRBRS) August 12, 2025

