ఏపీలో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు..

146
cm jagan
- Advertisement -

ఏపీలో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేశారు. అక్టోబరు 15 నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్రం ఇటీవల ఇచ్చిన సడలింపులతో జనజీవనం దాదాపు సాధారణ స్థితికి వచ్చిందని చెప్పాలి. ఈ క్రమంలో ఏపీ సర్కారు అక్టోబరు 15 నుంచి అమల్లోకి వచ్చేలా తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా నివారణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులను అడిగి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారు. కరోనా నియంత్రణను సమర్థంగా నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.

-కొవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.
-సినిమా థియేటర్లలో కరోనా నివారణపై టెలీ ఫిల్మ్ ద్వారా ప్రచారం.
-స్కూళ్లు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి.
-పాఠశాలల్లో ప్రతి పీరియడ్ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేసుకోవాలి.
-సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద శానిటైజర్లు తప్పనిసరి. మాస్కు లేనివారికి ప్రవేశం నిషేధం.
-రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధిగా భౌతికదూరం పాటించాలి.
-బస్సులు, ఇతర రవాణా వాహనాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
-ప్రార్థనా మందిరాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి.
-బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మాస్కులు ధరించాలంటూ మైక్ ల ద్వారా ప్రచారం.

- Advertisement -