ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన..

118
sajjala
- Advertisement -

సుదీర్ఘ కసరత్తు అనంతరం ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది జగన్ సర్కార్. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలను వెల్లడించారు. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68 పోస్టులు, పురుషులకు 67 పదవులు కేటాయించామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కట్టబెట్టారు.

నామినేటెడ్‌ పోస్టుల వివరాలు..

()కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు
()సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
()వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
()గ్రంథాలయ సంస్థ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
()ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ
()మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి
()టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌
()హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
()డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
()బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
()బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌
()ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
()ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని
()ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
()ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం
()సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత

- Advertisement -