బాహుబలి.. రోజుకు ఆరు షోలు

329
- Advertisement -

బాహుబలి ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా బాహుబలి : ది కన్‌క్లూజన్. మరోవారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమాను చూసేందుకు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాజమౌళి కట్టప్పతో ‘బాహుబలి’ని చంపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా?’ అని ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ కన్‌క్లూజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సస్పెన్స్ వీడాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే అని ఆర్కా మీడియా ఆంక్షలు విధించింది. దీంతో తమకు ఎంతో కొంత సమాధానం తెలిసినా కూడా బాహుబలి చిత్ర యూనిట్ ఆ విషయాన్ని రివీల్ చేయలేదు.

AP Govt Allows 6 Shows Daily for 'Bahubali 2

మరి దేశం మొత్తాన్ని ఒక ప్రశ్న వేధించడం మొదలు పెట్టింది.. 2015 నుండి అదే.. బహుబలిని కట్టప్పా ఎందుకు చంపాడు? దీని లో చాలా మంది తెలుసుకోవాలి అని అడిగిన వాళ్ళు కన్నా.. అర్ధంకాక అడిగినా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం వస్తుంది బాహుబలి 2 ఈ నెల ఏప్రిల్ 28న.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 సినిమా ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధంగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ సినిమాను ఆరు షోలు ప్రదర్శించుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సర్కార్ నుంచి ఆ సినిమా యూనిట్‌కి అనుమతి ల‌భించింది. ఈ నెల 28 నుంచి ప‌ది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆరు షోలు ప్రదర్శించుకోవడానికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. దీంతో బాహుబ‌లి టీం, అభిమానులు ఎంతో ఖుషీగా ఉన్నారు. మ‌రోవైపు ఈ రోజు విడుద‌లైన బాహుబలి వీడియో సాంగ్ ప్రోమో ఆ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది.

- Advertisement -