అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ పాదయాత్ర జరగనుండగా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు నేతలు.
ఇక పాదయాత్ర నేపథ్యంలో టీపీసీసీ,ఏపీపీసీసీ కమిటీలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఇక ఇప్పటికే రాహుల్‌ను పాదయాత్ర తెలంగాణ నుండే ప్రారంభించాలని కోరుతామని వెల్లడించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అదిష్టానం నుండి పిలుపు అందింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పలువురు సీనియర్ నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పాదయాత్ర వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాహుల్ పాదయాత్రతో తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.