శ్రీలంకలో పెట్రో ఎమర్జెన్సీ..

51
- Advertisement -

ఆర్ధికం సంక్షోభంతో శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఇప్పటికే ప్రజలు అధ్యక్షుడు రాజపక్సపై తిరుగుబాటు జెండా ఎగురవేయగా ఆయన దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని అక్కడి న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇక మరోవైపు శ్రీలంకలో పెట్రోలు నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే బంకుల్లో నిల్వ ఉంది. ఈ షాకింగ్ న్యూస్ స్వయంగా దేశ ప్రధాని విక్రమ సింఘే ప్రకటించారు.

ఈ ఏడాది ఆరంభం నుంచే శ్రీలంకలో పెట్రోల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఈ గడ్డు స్థితి నుంచి గట్టేక్కాలంటే పొరుగు దేశాల నుంచి పెట్రోల్ ను యుద్ధప్రాతిపదికన దిగుమతి చేసుకోవాల్సిందే.

- Advertisement -