- Advertisement -
ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడులో విషాదం నెలకొంది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఓ ఇంజనీరు మృతిచెందారు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి విహారయాత్రకు అమెరికా వెళ్లారు హరీశ్. ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని ఇతాకా జలపాతం సందర్శనకు వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారీ జలపాతంలో పడి మృతిచెందారు.
మెకానికల్ ఇంజినీర్ అయిన నెక్కలపు హరీశ్ చౌదరి (35) కెనడాలోని అంటారియోలో ఓ కంపెనీలో టూల్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. తానా సాయంతో హరీశ్ మృతి దేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
- Advertisement -