BB6..నిజంగా ఎమోషనల్ టాస్కే

81
Biggboss telugu6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 38 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఎమోషనల్ టాస్క్ బ్యాటరీ ఛార్జ్ కొనసాగుతూనే ఉంది. టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌ చేత కన్నీళ్లు పెట్టించారు.

తొలుత గీతూ తన తండ్రితో ఆడియో కాల్‌ మాట్లాడగా ఆ తర్వాత అర్జున్‌ వాళ్ళ నాన్న దగ్గర్నుంచి వీడియో మెసేజ్‌ని తీసుకునే ఆప్షన్ తీసుకున్నాడు. తండ్రి వీడియో మెసేజ్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇక ఆ తర్వాత ఇనయా వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ఫోటోని తీసుకునే ఆప్షన్ ఎంచుకుంది. ఆ ఫోటో వచ్చాక దాన్ని చూసి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఫైమాకి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో ఇంటి సభ్యులు కూడా సక్సెస్ అవ్వడంతో 85శాతం బ్యాటరీ రీచార్జ్ పెరిగింది. మొత్తంగా ఇవాల్టి ఎపిసోడ్‌తో ఈ టాస్క్‌ పూర్తికానుండగా బిగ్ బాస్ ఎవరిని కెప్టెన్‌ చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -