ఆటోజానీ అటకెక్కింది!

57
chiru
- Advertisement -

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ మెగాస్టార్‌ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్‌ చేసుకున్నాడు. అంతేకాదు ఈ మూవీ కోసం ఆటో జానీ కథను రెడీ చేసుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఫస్టాఫ్‌ బాగున్నా సెకండాఫ్ బాలేదని కథలు మార్పులు చేయాలని చిరు సూచించగా తర్వాత రెండు సార్లు కథ వినిపించిన చిరు కన్విన్స్‌ కాలేదు.

ఇక తాజాగా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ గాడ్‌ఫాదర్‌లో నటించి మెప్పించారు పూరి జగన్నాథ్‌. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మెగాస్టార్ స్పూర్తితోనే తాము ఇండస్ట్రీలో అడుగుపెట్టామని….ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టం అని తెలిపారు.

ఈ సందర్భంగా ఆటోజానీ ప్రస్తావన తీసుకురాగా ఆ సినిమాను పక్కన పెట్టేశానని తెలిపారు. అయితే ఆటోజానీకి మించిన కథను రెడీ చేస్తానని తెలిపారు పూరి.

- Advertisement -