ఏపీలో మొదటి రౌండ్‌ ఫలితాలు.. వైసీపీ ఆధిక్యం

276
AP Election Results
- Advertisement -

ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. దిగువసభ ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన 8,049 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఏప్రిల్‌ 11 మొదలు మే 19 వరకు ఏడు విడతల్లో.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలతో హోరాహోరీగా సాగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి.

ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్ ను పూర్తి చేయగా, తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ నుంచి మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి, నెల్లూరు టౌన్ లో పోలుబోయిన అనిల్ కుమార్, కడపలో షేక్ అంజాద్ బాషా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్, మచిలీపట్నంలో పేర్ని నాని (వెంకట్రామయ్య), అరకులో చెట్టి ఫాల్గుణ, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టెక్కలి నుంచి పేరాడ తిలక్, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు ఆధిక్యంలో ఉన్నారు.

ఇదే సమయంలో టీడీపీ తరఫున పెద్దాపురం నుంచి బరిలోకి దిగిన నిమ్మకాయల చినరాజప్ప, మంగళగిరిలో నారా లోకేశ్, రాజమహేంద్రవరం నుంచి ఆదిరెడ్డి భవాని ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకూ 13 నియోజకవర్గాల్లో తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా, వైసీపీ 10, టీడీపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

- Advertisement -