ఏపీలో పీఆర్సీ సమస్యపై నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగుల సహకరించాలి. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైన వృత్తి… వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా?. అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గురించి టీచర్స్ వాడిన భాష సరైంది కాదని హీతవు పలికారు.
టీచర్స్ వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ చదువుతున్నారా? 70 వేలు,లక్షల జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రవేటు స్కూల్స్లో చదివిస్తున్నారు. మీ పిల్లలను మీరు పాఠాలు చెప్పే స్కూల్స్ లో ఎందుకు చదివించడం లేదు అని ప్రశ్నించారు. టీచర్స్ వారి సమస్యలు ముఖ్యమంత్రిని కలిసి చెప్తే సరిపోయేది. ఏదయినా ఉంటే చర్చలు జరపాలి.. అలా రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం కరెక్టు కాదు అన్నారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులు చెప్తే కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.