ఏపీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు ప్రకటించింది. ఈ సడలింపులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తున్నామని, ఈ నెల 21 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. అయితే, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఉంటుందని, మరో గంట సేపట్లో దుకాణాల సిబ్బందికి ఇంటికి వెళ్లేందుకు సమయం ఉంటుందని చెప్పారు.
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని వివరించారు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపారు. తాజా సడలింపులు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వివరించారు. కొవిడ్‌పై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కర్ఫ్యూ వేళలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.