సమంత వదిలిన ‘కల్యాణం’ సాంగ్..

168
Samantha Akkineni
- Advertisement -

ఆనంద్ దేవ‌ర‌కొండ నటిస్తోన్న తాజాగా చిత్రం పుష్ప‌క విమానం. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని దామోద‌ర్ డైరెక్ట్ చేస్తున్నాడు. శాన్వి మేఘ‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడ‌క్ష‌న్స్-టాంగా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ విడుద‌ల తేదీ ఎప్పుడనేది ప్ర‌క‌టించ‌నున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి క‌ల్యాణం స్పెష‌ల్ సాంగ్‌ను టాలీవుడ్‌ బ్యూటీ స‌మంత అక్కినేని విడుద‌ల చేసింది. అమ్మ‌లాలో పైడి కొమ్మ‌లాలో..ముద్దుల గుమ్మ‌లాలో. సంద‌ళ్లు నింపాలే పందిళ్ల‌లో బంగారు బొమ్మ‌లాలో అంటూ పెండ్లి వేడుకతో సాగుతున్న పాట అద్బుత‌మైన లిరిక్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌కు రామ్ మిర్యాల మ్యూజిక్ అందించాడు. సిద్ శ్రీరామ్‌, మంగ్లీ, మోహ‌న బోగ‌రాజు, దివ్య మాలిక‌, హ‌రిప్రియ (కోర‌స్‌) పాడారు.

- Advertisement -