బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం..

27
CM Nitish Kumar

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ఏడో సారి ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. పట్నాలోని రాజ్‌భవన్‌లో సాయంత్రం 04.30కి నితీష్ చేత గవర్నర్ ప్రాగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. జేడీయూకు సీఎం పదవి వెళ్లడంతో.. బీజేపీకి రెండు డీప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీష్ కుమార్‌తో పాటు బీజేపీ నేతలు తార్ కిశోర్ ప్రసాద్, రేణు దేవి డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలు, జేడీయూ నేతలు హాజరయ్యారు.

నితీష్‌తో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక నందకిశోర్ యాదవ్ బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ నేతలెవరూ హాజరుకాలేదు. మరోవైపు సీఎంగా మరోసారి బాధ్యతలను స్వీకరించిన నితీష్ కుమార్ కు దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.